తీపికబురు అందించిన కేంద్రం

తీపికబురు అందించిన కేంద్రం

ఢిల్లీ : ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PMJAY) పథకాన్ని ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది దింతో  దేశంలోని సుమారు 4.5 కోట్ల కుటుంబాలను కవర్ చేస్తుంది మరియు దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలు లభించనున్నట్లు కేంద్రం వెల్లడించింది . అర్హులైన అందరికి ప్రత్యేకమైన కార్డును అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

వారి ఆధార్ కార్డు ప్రకారం 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని అధికారిక వర్గాలు తెలిపాయి. వారం రోజుల్లో ఈ పథకం అమలులోకి వచ్చే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇది ఆన్లైన్  అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.  70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌ల కోసం నియమించబడిన లింక్‌ను కలిగి ఉంటుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ మరియు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) లబ్ధిదారులు కూడా AB PMJAY స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సోర్సెస్ పేర్కొన్నాయి.

3,437 కోట్ల రూపాయల వ్యయంతో AB PMJAY కింద ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆరోగ్య కవరేజీని బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS