నిబంధనలు పాటించాలి: సీఐ పులి శేఖర్‌ గౌడ్

నిబంధనలు పాటించాలి: సీఐ పులి శేఖర్‌ గౌడ్

తుగ్గలి, ఆగస్టు 24 ( వెలుగు న్యూస్ ): తుగ్గలి మండల కేంద్రంలో పత్తికొండ రూరల్ సీఐ పులి శేఖర్‌ గౌడ్ నేతృత్వంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రహదారులపై ప్రయాణిస్తున్న వాహనాలను పరిశీలిస్తూ డ్రైవర్లు ట్రాఫిక్ నియమావళిని పాటిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. సీఐ పులి శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ రహదారి భద్రత పట్ల ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని తెలిపారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను ఎప్పటికప్పుడు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులకు పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటిస్తూ ప్రమాదాల నివారణకు, రహదారి భద్రత పరిరక్షణకు సహకరించాలని సీఐ పులిశేఖర్‌ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్స్ లేపాక్షిప్ప, మోహన్ రాజు, సైఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS