నూతనపల్లె గ్రామంలో RUCE ఎన్ఎస్ఎస్ యూనిట్ 5 ఆధ్వర్యంలో బీపీ, షుగర్, HIV, కంటిపరీక్షలు

నూతనపల్లె గ్రామంలో RUCE ఎన్ఎస్ఎస్ యూనిట్ 5 ఆధ్వర్యంలో బీపీ, షుగర్, HIV, కంటిపరీక్షలు

కర్నూలు, న్యూస్ వెలుగు: జాతీయ సేవాపథక స్పెషల్ క్యాంపులో భాగంగా ఆరవరోజు నూతన పల్లె గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు ప్రోగ్రాం ఆఫీసర్, శ్రీ బి. వి. శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. నూతనపల్లె గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రివారి సహకారంతో గ్రామీణులకు బ్లడ్ షుగర్, రక్తపోటుకు సంబంధించిన పరీక్షలు మరియు HIV పరీక్షలు, కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. మలేరియా, డెగ్యూ, జలుబు, దగ్గు,HIV జ్వరంలాంటి వ్యాధులపట్ల అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో HIV డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫీసర్ పి. నాగరాజు, వాకిన్ కంటివైద్యశాల వైద్యులు డాక్టర్ ఎస్. వాజీద్ హుస్సేన్, మెడికవర్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ వై. మహేశ్వర్ రెడ్డి, AGM ఖాదర్ భాషా, క్యాంప్ ఇన్ఛార్జ్ జి. రామాంజినేయులు, క్యాంప్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. నందిని తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!