
యువతికి న్యాయం చేసేంతవరకు పోరాటం ఆగదు : జై భీమ్ యువత ఫౌండేషన్
పత్తికొండ (న్యూస్ వెలుగు ) : జై భీమ్ యువత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆవుల సోమన్న ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక పత్తికొండ ఎంపీడీవో ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి అటెండర్ పసిఫిక్ ను వెంటనే సస్పెండ్ చేయాలి బాలికపై లైంగిక వేధింపులకు గురైచేసిన ఎంపీడీవో ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి అటెండర్ పసిఫిక్ ను వెంటనే సస్పెండ్ చేయాలి అన్ని రకాలుగా విచారించిన తర్వాత ఆయన పైన కేసు నమోదు చేసి రిమాండ్ కూడా పోయినప్పటికీ ఇంతవరకు కూడా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా ఆయనను సస్పెండ్ చేయలేదు. దీనిని జై భీమ్ ఖండిస్తుంది ఆయనపై కేసు నమోదైనటువంటి కేసు నంబర్ 55/2026 పత్తికొండ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.నమోదయి ఇప్పటికి దాదాపుగా 15 రోజులు కావస్తున్న ఆయన పై ఎటువంటి చర్యలు తీసుకోలేరు.ఆయనను వెంటనే చర్య తీసుకుని సస్పెండ్ చేయాలని జై భీమ్ ఆధ్వర్యంలో అధికారులను మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ప్రభుత్వ అధికారులను ఆయన డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జై భీమ్ నాయకులు గోవిందు రమణ చిన్న గోవిందు తదితరులు పాల్గొన్నారు.

