
శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన విశాఖ నగర కమిషనర్
విశాఖ : రోడ్డు ప్రమాదాల నివారణకు ఆటో డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన విశాఖ నగర పోలీసులు. విశాఖలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, పోలీసు & ఆటో డ్రైవర్ల మధ్య మంచి సంబంధం నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో నగరంలో ఉన్నటువంటి 4500 మంది ఆటో డ్రైవర్లను 16 బ్యాచులుగా విభజించి, ఉత్తమ నిపుణులతో శిక్షణ కార్యక్రమంను డా.శంకబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్.,సీపీ గారు ప్రారంభించారు.అనంతరం ఆటో డ్రైవర్ల కు పాటించవలిసిన నియమాలు చెబుతూ త్వరలో “మన ఆటో మన వైజాగ్”అనే వినూత్న కార్యక్రమం ప్రారంభించబోతున్నాం అని తెలియజేసారు.
Was this helpful?
Thanks for your feedback!