భిన్నత్త్వంలో ఏకత్వానికి జాతీయ సమైక్యత కారణం
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; భిన్నత్త్వంలో ఏకత్వానికి దేశ గొప్పతనానికి జాతీయ సమైక్యత కారణమని ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు, రాజంపేట జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పసుపులేటి .శంకర్ బుధవారం నంద్యాల జిల్లా పాణ్యం రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీర్ కళాశాలలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో జాతీయ సమైక్యత మనిషి యొక్క ఉన్నత జీవిత విలువలపై నడుచుకోవాల్సిన ఆవశ్యకతపై క్షుణ్ణంగా విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా వృత్తి విలువలపై కూడా వివరించారు .అనంతరం కళాశాల యాజమాన్యం ఆయనను శాలువాతో పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాంతి రాముడు, జయచంద్ర ప్రసాద్, అశోక్ కుమార్, ప్రియదర్శిని , చెన్నకేశవ, చిన్న రాయుడు, వెంకట రవి శంకర్ తదితర కళాశాల యాజమాన్యం పాల్గొంది.
Was this helpful?
Thanks for your feedback!