
సంతజూటూరు లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ప్రత్యేక అలంకరణలో సిఎస్ఐ సిజేయమ్ చర్చిలు
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: మండలంలోని సంతజూటూరు గ్రామంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిలకు క్రైస్తవులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చర్చి పాస్టర్లు ఏసుక్రీస్తు జన్మదిన విశిష్టతను వివరించారు. కరుణ , ప్రేమ, దాతఅత్వం, త్యాగం, ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహౌన్నత సందేశాలు మానవాళిని సత్యపదం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గ నిర్దేశం చేశారని హితబోధ చేశారు.లోక రక్షకుడు ఏసుక్రీస్తు అని అన్నారు.
అనంతరం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. క్రిస్మస్ వేడుకలను భక్తిశ్రద్ధలతో సోదర భావంతో అంగరంగ వైభవంగా పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి బేతిఏసేపు,CSIసంఘం పెద్దలు
జసూర్యరాజు,శ్రీకాంత్,దేవకుమార్, సుందరావు,సుకుమార్, పుల్లయ్య
హరిబాబు,ప్రతాప్,కొత్తూరయ్య, విజయ్,సురేష్,సునీల్ క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.