‘టిఫిన్ టేస్ట్ ఎలా ఉందమ్మా?’

‘టిఫిన్ టేస్ట్ ఎలా ఉందమ్మా?’

 అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యతపై నగరపాలక కమిషనర్ ఆరా

న్యూస్ వెలుగు, నగరపాలక సంస్థ; ‘టిఫిన్ టేస్ట్ ఎలా ఉందమ్మా?’ అంటూ అన్న క్యాంటీన్ల వద్ద అల్పాహారం చేస్తున్న జనాన్ని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు సరదాగా పలకరించి, అల్పాహార రుచి, నాణ్యతలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కొండారెడ్డి బురుజు సమీపంలోని పూల మార్కెట్ వద్దనున్న అన్న క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించారు. అన్న క్యాంటీన్ల వద్ద ఎప్పటికప్పుడు స్వచ్ఛత పనులు చేపట్టాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పేదలకు మూడుపూటలా రుచికరమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు. తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారని, రోజువారీ వివరాలు ప్రభుత్వానికి పంపిస్తున్నామని కమిషనర్ తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!