Delhi : ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, CCEA, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) కోసం 11,440 కోట్ల రూపాయల పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పునరుద్ధరణ ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు. దేశంలోని ఉక్కు రంగంలో ఆర్ఐఎన్ఎల్ ముఖ్యమైన కంపెనీ అని, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందన్నారు. ఈ ప్యాకేజీ సహాయంతో ఆర్ఐఎన్ఎల్ ఉద్యోగులందరికీ, అలాగే ఆర్ఐఎన్ఎల్ ఆర్థిక కార్యకలాపాలతో అనుసంధానించబడిన ప్రజలందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వైష్ణవ్ చెప్పారు.
