వారు రాజకీయాల్లోకి రావాలి: మంత్రి నారాలోకేష్

వారు రాజకీయాల్లోకి రావాలి: మంత్రి నారాలోకేష్

న్యూస్ వెలుగు బాపట్ల జిల్లా:  ఇంకొల్లులో డాక్టర్ డీవీఆర్ స్కూల్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారలోకేష్  ప్రసంగించారు.  చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిచ్చారు. గురువులను దేవుడితో సమానంగా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. తల్లుల త్యాగల వల్ల మనం చదువుకోగలుగుతున్నామని ,  వారి త్యాగాల వల్లే  ఈ స్థాయికి వచ్చినట్లు  తెలిపారు. అందుకే మనం తల్లులను గౌరవించాలి. ఇల్లు దాటే ముందు తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలని పిల్లలను కోరుతున్నాట్లు తెలిపారు. నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు  ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ ను ఏర్పాటుచేయడం ఆనందంగా ఉందని తెలిపాను. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS