
ఎగ్జిబిషన్‌ను సందర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఎగ్జిబిషన్‌ను సందర్శించిన మంత్రి :
ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్‌గా భారత్ ఎదగాలి – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెన్నై ట్రేడ్ సెంటర్లో CII, IDGS ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో 6వ ఎడిషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా గేమింగ్, ఈ-స్పోర్ట్స్ పరిశ్రమకు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను సందర్శించి, ఆధునిక సాంకేతికతలు, కొత్త ట్రెండ్స్‌పై ఆసక్తి వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో దేశ విదేశాల ప్రతినిధులతో కలిసి పాల్గొని ప్రసంగిస్తూ, గేమింగ్ రంగం యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నదని, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో IDGS అధ్యక్షులు రాజన్ నవానీ, వైస్ ప్రెసిడెంట్ సీన్ సోన్ ను మంత్రి అభినందించారు. అలాగే IDGS సెక్రటేరియట్ సభ్యులు సుభాష్ సర్పు, మధురిమ మణియర సపాల్గొన్నారు .
గేమింగ్ రంగ అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు మరింత దోహదం చేస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

