మాజీ సీఎం జగన్ భద్రత పై కోర్టుకి సమాదనం ఇచ్చిన పోలీస్ శాఖ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం హోదాలో జగన్‌మోహన్‌రెడ్డికి నిబంధనల ప్రకారమే భద్రతా సిబ్బందిని కేటాయించినట్లు రాష్ట్ర పోలీసుశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోందని భద్రత తగ్గించారంటూ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వాదన నిజం కాదని పోలీసుశాఖ,ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. తన భద్రతను తగ్గించేశారని, జూన్ 3 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆయన వాదనలో వాస్తవం లేదని పోలీసుశాఖ తెలిపింది.
ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయనకు ముఖ్యమంత్రికి కల్పించే భద్రత ఇవ్వటం కుదరదని తెలిపింది. ప్రస్తుతం జగన్‌కు 58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని… ఆయన ఇంటి వద్ద 10 మంది సాయుధ గార్డుల భద్రత ఉందని… షిఫ్టు కు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు పీఎస్‌వోలు 24 గంటల పాటు ఆయనకు భద్రత కల్పిస్తారని పోలీసు అధికారులు కోర్టుకు తెలిపారు.