ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదు

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

ఆర్.ఐ.ఓ గురువయ్య శెట్టి వెల్లడి

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్  జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లుఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి గురవయ్య శెట్టి పేర్కొన్నారు. నేడు గురువారం ఆర్.ఐ.ఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.కర్నూల్ జిల్లాలో 69 సెంటర్ లలో పరీక్షలు ఏర్పాటు చేశారు.మొదటి సంవత్సరం విద్యార్థులు 23, 098 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 22,227 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని ముందు గాను 22 పోలీస్ స్టేషన్లో ప్రశ్నపత్రాలు మూడు చెట్లను భద్రపరచినట్లు తెలిపారు. జిల్లాలో ఏడు సమస్యాత్మక కేంద్రాన్ని గుర్తించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించేది లేదన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రంలో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. సీసీటీవీ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి టాయిలెట్ సీసీ కెమెరాల ఏర్పాటు ఏదైనా సమస్య వస్తే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా మాస్ కాపింకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు ఉదయం 9 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రం లోకి అనుమతించేది లేదన్నారు. 69 పరీక్ష కేంద్రాలకు సంబంధించి స్పెషల్స్ కార్డు సెట్టింగ్స్ కాదు స్పెషల్ ఆఫీసర్లు డి ఈ సి మెంబర్స్ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జి లాలెప్ప డిఇసి మెంబర్ నాగభూషణ్ రెడ్డి, పద్మావతి, సురేష్ చంద్ర,రమాదేవి పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!