
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఒల్డ్ లెక్చర్ హాల్ లో ప్రపంచ కిడ్నీ డే
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో (WKD) ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జి జి హెచ్ మరియు కేఎంసి, నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో సీఎంఈ ప్రోగ్రాం నిర్వహించినట్లు తెలిపారు.
కిడ్నీ సంబంధిత వ్యాధులను గుర్తించి ప్రజలకు అవగాహన
ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (సీకేడీ) గురించి అవగాహన పెంచడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను ఎదుర్కోవడంలో ప్రజలందరి భాగస్వామ్యన్ని పెంచడానికి ఇదో మంచి ముందడుగని అన్నారు. కిడ్నీ అనేది మన అవయవాలలో ముఖ్య భాగమని శరీరంలో ఎటువంటి చెడు పదార్థాలైన బహిర్గతం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు.కిడ్నీ సంబంధించిన డైట్ ప్రతి ఒక్కరు అనుసరించాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.ఎ.శశికిరణ్ M.D.,D.M. సీనియర్ నెఫ్రాలజిస్ట్ & ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్, హైదరాబాద్ ,ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్, డా. శ్రీరాములు, డా.సీతారామయ్య, నెఫ్రాలజీ విభాగపు వైద్యులు, డా.జిక్కి, డా.ఆనంత్, డా.వెంకటపక్కి రెడ్డి, డా.శ్రీధర్ శర్మ, మరియు వైద్యులు తదితరులు పాల్గొన్నారు.