Holagunda News Velugu :

హోలగుంద మండల పరిధిలోని గజ్జహళ్ళి గ్రామంలో వెలిసిన శ్రీ పోతులింగేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు నిర్వహించిన లంకా దహన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. గజ్జహల్లి గ్రామం నందు 28 వ వార్షిక రథోత్సవ కార్యక్రమం నాలుగు రోజులపాటు పోతులింగేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి ఆలయ ఆవరణ నందు ఏర్పాటుచేసిన లంక దహన కార్యక్రమంలో భాగంగా రకరకాల, రంగురంగుల బాణాసంచా కాలుస్తుండడంతో భక్తులకు ఎంతో కనువిందు చేశాయి. అదేవిధంగా రథోత్సవ, లంకా దహన ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరుభట్ల నాగమ్మ, వైస్ ఎంపీపీ మహాదేవమ్మా, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!