
సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి : జిల్లా ఎస్పీ విక్రాంతి పాటిల్
కర్నూలు న్యూస్ వెలుగు : జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలను అధికామించేందుకు జిల్లా ఎస్పీ విక్రాంతి పాటిల్ నూతన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. స్కూల్లను మొదలుకొని రైతుల వరకు ప్రజలకు అవగాహన కార్యక్రమములు ముమ్మరంగా నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు.” నేను సైబర్ స్మార్ట్ కార్యక్రమం” లో బాగంగా సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లా ఎస్పీ నూతనంగా శ్రీకారం చుట్టిన “ నేను సైబర్ స్మార్ట్ “ కార్యక్రమం పై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకూడదని లఘు చిత్రాలతో పట్టణాలు, గ్రామాలలోని ప్రధాన కూడలిలో ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ అరెస్టు, జాబ్ ఫ్రాడ్స్, కెవైసి ప్రాఢ్స్, ఇన్వెస్ట్ మెంట్స్ ప్రాడ్స్ , బ్యాంకు ఖాతాల ఓటిపిలు తెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దని , తెలియని లింకుల పై క్లిక్ చేయరాదని తెలియజేస్తున్నారు.
ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేసి సమాచారం అందించి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన ఒక గంట లోపే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి ఫిర్యాదు చేస్తే తప్పక న్యాయం జరుగుతుందన్నారు. సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో బాధితులు వివరాలు నమోదు చేయాలన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ పోలీసు అధికారులను సంప్రదించి సైబర్ నేరం జరిగిన వివరాలను తెలియజేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 38 పోలీసు స్టేషన్ పరిధులలో 1062 ” నేను సైబర్ స్మార్ట్ ” అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాలలో 84,838 మంది ప్రజలకు సైబర్ నేరాల బారిన పడకూడదని అవగాహన కల్పించినట్లు జిల్లా పోలీసు కార్యాలయo వెల్లడించింది.