మెరుగైన ఫలితాలు సాధించాలి

మెరుగైన ఫలితాలు సాధించాలి

 కర్నూలు న్యూస్ వెలుగు: రానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు జి సురేంద్ర అన్నారు. గురువారం ఎమ్మిగనూరు మండల పరిధిలోని సాగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న పరిస్థితులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన పథకాన్ని రుచి చూశారు. అనంతరం ఉపాధ్యాయులు ఎలా విద్యాబుధన చేస్తున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!