అంగన్వాడీలకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలి

అంగన్వాడీలకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలి

పత్తికొండ న్యూస్ వెలుగు :పత్తికొండ పట్టణంలోని స్థానిక కోరమండల్ ముందు సిఐటియు అంగనవాడి వర్కర్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమస్యల పరిష్కారానికై ఐదు రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర, అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిల్ సెంట్రల్ గా మార్చాలన్నారు. గ్రాటివిటీ అమలుకై గైడ్లైన్స్ రూపొందించాలని వేతనంతో కూడిన మెడికల్ లివ్వులు ఇవ్వాలన్నారు. ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ అంగన్వాడి సెంటర్లలో ఉండాలని జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు డి గోపాల్, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దస్తగిరి, సిఐటియు తుగ్గల మండలం కార్యదర్శి శ్రీరాములు, మద్దికేర మండలం కార్యదర్శి బురుజుల రాముడు, అంగన్వాడి వర్కర్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు చిట్టెమ్మ, పద్మజ, పత్తికొండ మండలం అధ్యక్ష కార్యదర్శులు సావిత్రిబాయి, లక్ష్మి, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు కాశి, మండల కార్యదర్శి రమేష్, రైతు సంఘం నాయకులు రాజుల కారన్న, దూదకుండా కాసిం, అంగన్వాడి కార్యకర్తలు. కస్తూరిబాయ్, రమీ జాబి, వనజ, జయకుమారి, చంద్రకళ, కుమారి, తదితరులు పాల్గొన్నారు,

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS