
కొత్తపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
కర్నూలు న్యూస్ వెలుగు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు.కొత్తపేటలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ లో ఫ్రీ సీటు సాధించిన సంకేత్ ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రవికుమార్,బాలరాజు, దేవరాజు, ఉదయ్, హనీఫ్,దేవమ్మ సులోచనమ్మ, దానిమ్మ,లక్కీ, చిన్న, సుధీర్, మరియు కాలనీ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!

