
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది : కాంగ్రెస్
నంద్యాల జిల్లా: డోను పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వేడుకల్లో నంద్యాల కాంగ్రెస్ పార్టీ డిసిసి ముఖ్య అతిథులుగా పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించినట్లు తెలిపారు. ప్రపంచ మేధావిగా భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని ఆయన అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు సమూచిత గౌరవం దక్కాలన్న ఉద్దేశంతో అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా భారత రాజ్యాంగంలో అనేక మార్పులను తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తిని కొనియాడారు. దేశంలో అంటరానితనం అస్పృశ్యత రాజ్యాధికారం ప్రజలను మేల్కొల్పిన మహా నేత అని ఆయన అన్నారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగాన్ని సైతం మార్చేందుకు అనేక కుట్రలకు పూనుకున్నదని డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి విమర్శలు చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చాక పౌర హక్కులను సైతం పోనీ చేస్తుంది, భారత రాజ్యాంగాన్ని సైతం అపహేళన చేస్తుందని మండిపడ్డారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలకు బిజెపి సమూచిత గౌరవం అందించడం లేదన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న అంబేద్కర్ ఆలోచనలను బిజెపి కాలరాస్తుందని… బిజెపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వారు అన్నారు యువత మేలుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్టార్ కోచింగ్ డైరెక్టర్ &, జిల్లా స్పోక్స్ పర్సన్ ఎమ్ జయరాం,జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు పి. జీవన్ బాబు,బేతంచెర్ల చెర్ల మండల అధ్యక్షులు ధోని రామాంజనేయులు,డిసిసి కార్యదర్శి ఆర్. గోపినాథ రావ్,డోన్ మండల అధ్యక్షులు పఠాన్ హుస్సేన్ బాషా,యువ భారత్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శి జి. మహేష్,తదితరులు పాల్గొన్నారు

