తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించిన అధికారులు

తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించిన అధికారులు

తుగ్గలి, న్యూస్ వెలుగు;  తుగ్గలి మండలంలో తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఫలితంగా అధికారులు తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించారు. గత కొంత కాలం నుండి జొన్నగిరిలోనే దళితవాడలో తీవ్రమైన మంచినీటి సమస్య ఏర్పడింది. దీంతో గ్రామానికి చెందిన దళితులు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో

ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆ సమస్యను పరిష్కరించకుండా నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరించారని దళితులు ఆరోపిస్తున్నారు. జొన్నగిరి దళితవాడలో ఏర్పడిన ఏర్పడిన మంచినీటి సమస్యను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పరిష్కరించకపోవడంతో చివరకు దళితులు సిపిఎం పార్టీ నాయకులు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో శుక్రవారం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శ్రీ రాములు ఆధ్వర్యంలో జొన్నగిరి సచివాలయాన్ని దళితులు ముట్టడించి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న దళితులు దాహం తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లు కూడా అధికారులు ఇవ్వకపోవడం దళితుల పట్ల ఇంత నిర్లక్ష్యమా.. అధికారులకు అంటూ దళితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలను ముట్టడించి ఆందోళన చేసే వరకు దళితులకు మంచినీళ్లు ఇవ్వరా అంటూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై దళితులు ఆగ్రహం చెందుతున్నారు. దళిత కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించకపోతే ఎస్సీ ఎస్టీ కమిషనర్, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటూ దళితులు పేర్కొనడంతో ఎట్టకేలకు స్థానిక పంచాయతీ కార్యదర్శి నారాయణస్వామి స్పందించి శుక్రవారం సాయంత్రం దళితవాడలో ఉన్న బోరుకు మరమ్మతులు చేయించి దళితులకు మంచినీళ్లు సరఫరా చేశారు. అంటే అధికారులు ఆందోళన చేసే వరకు ఏ సమస్య పరిష్కరించారని పలువురు మేధావులు పేర్కొంటున్నారు. మండలంలో తీవ్రమైన ఎండలు, తాగునీటి సమస్య ఉన్నప్పటికీ వాటి పరిష్కారానికి సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇంతవరకు ఎలాంటి సమావేశాలు కూడా అధికారులతో కలిసి నిర్వహించకపోవడం చాలా బాధాకరమని మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అవినీతికి పాల్పడి రెడ్ హ్యాండకా ఏసిపి అధికారులకి దొరికిన, ఇంకా ఆర్డబ్ల్యూఎస్ అధికారుల లొ చలనం లేదని పలువురు మేధావులు పేర్కొన్నారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి మంచి నీటి సమస్యకు బాధ్యులైన ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై తక్షణమే చర్య తీసుకొని మండలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఆ సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు జిల్లా ఉన్నత అధికారులను కోరుతున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS