FlatNews Buy Now
అంగరంగ వైభవంగా తుగ్గలి నాగేంద్ర పుట్టినరోజు వేడుకలు

అంగరంగ వైభవంగా తుగ్గలి నాగేంద్ర పుట్టినరోజు వేడుకలు

తుగ్గలి, న్యూస్ వెలుగు ; మండలం కేంద్రమైన తుగ్గలి లో శుక్రవారం తుగ్గలి నాగేంద్ర స్వగృహంలో తుగ్గలి నాగేంద్ర 60వ పుట్టినరోజు కార్యకర్తలు, అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పత్తికొండ పట్టణంలోని శారదా వృద్దాశ్రమంలో

వృద్ధులకు బ్రేడ్,పండ్లను తుగ్గలి మణికంఠ యూత్ సభ్యులు హోసూరు సురేష్ యాదవ్, లక్ష్మీనారాయణ యాదవ్, తుగ్గలి సాయి, కాసి విశ్వనాథ్, జె.సి.బి సూరి లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు మాట్లాడుతూ తుగ్గలి నాగేంద్ర గొప్ప మనసున్న వ్యక్తి బడుగు బలహీన వర్గాల వారికోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటాడు అటు వంటి వ్యక్తి మన నియోజకవర్గంలో పుట్టడం ప్రజలు చేసుకున్న పుణ్యం అని తుగ్గలి నాగేంద్ర నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ ఆయన ఎప్పుడూ పుట్టినరోజులు జరుపుకోవడానికి మొగ్గు చూపలేదని, కార్యకర్తలు, అభిమానులు తనకు తెలియకుండా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ఆయన్ను నమ్ముకున్న ప్రజలను నేనెప్పుడూ వీడనని, సాయం అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. అలాగే ఈ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ మధుసూదన్ నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మధుసూదన్ నాయుడు, తుగ్గలి నాగేంద్ర దంపతులను కలిసి తుగ్గలి నాగేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS