మొలకలకుంట, న్యూస్ వెలుగు : స్థానిక మొలకలకుంట పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి రక్షించేందుకు రెవెన్యూ (ఎమ్మార్వో) మరియు నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ అధికారులు సంయుక్తంగా కీలక చర్యలు చేపట్టారు. ఆక్రమణలకు గురికాకుండా

ఉండేందుకు అధికారులు వివాదాస్పద స్థలంలో సర్వే నిర్వహించి, హద్దులను నిర్ధారించారు. అనంతరం ఈ స్థలం “మొలకలకుంట ఇరిగేషన్ శాఖకు చెందినది” అని స్పష్టంగా రాసి ఉన్న సరిహద్దు రాళ్లను (Boundary Stones) నాటారు. భూమిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని స్వాధీన ప్రక్రియను పూర్తి చేశారు. ప్రభుత్వ ఆస్తులు మరియు ఇరిగేషన్ శాఖ స్థలాలను ఆక్రమణదారుల బారిన పడకుండా సకాలంలో స్పందించి రక్షించిన ఎమ్మార్వో, ఇరిగేషన్ శాఖ అధికారుల పనితీరుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమన్వయాన్ని, బాధ్యతాయుతమైన చొరవను కొనియాడుతూ గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Thanks for your feedback!