
విమర్శనాత్మక వార్తల పట్ల జర్నలిస్టులపై క్రిమి నల్ కేసులు సరికాదు…సుప్రీం కోర్ట్…
న్యూస్ వెలుగు , డెస్క్ టీమ్ : ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జర్నలిస్టులు వా ర్త లు,కథనాలు రాశారనే కారణంతో వారిపై క్రి మినల్ కేసులు నమోదు చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ప్రజాస్వామ్య దేశా ల్లో అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను గౌర వించాలని పేర్కొంది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) కింద జర్నలిస్టుల హక్కులు రక్షించ బడతాయని దేశ అత్యున్నత న్యాయస్థానం పే ర్కొంది.కేవలం ఒక జర్నలిస్టు రాసిన కథనం ప్ర భుత్వంపై విమర్శగా కనిపించిందనే కారణం తో అతనిపై క్రిమినల్ కేసులు పెట్ట కూడదని వ్యాఖ్యానించింది.ఉత్తరప్రదే శ్‌కు చెందిన జర్న లిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టి వేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లోని అధికారుల నియామకాల్లో కుల సమీకర ణాలపై ఆయన రాసిన కథనం నేపథ్యంలో ఎ ఫ్‌ఐఆర్ నమోదైంది.ఈ పిటిషన్‌ను జస్టిస్ హృ షికేష్ రాయ్,జస్టిస్ ఎస్.వీ.ఎన్.భట్టితో కూడి న ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌కు మ ధ్యంతర రక్షణ కల్పిస్తూ…సంబంధిత కథనాని కి సంబంధించి ఆయనపై ఎలాంటి బలవంత పు చర్యలు తీసుకోరాదని ఉత్తర్వులు జారీ చేసింది
Was this helpful?
Thanks for your feedback!

