ట్రాన్స్ జెండర్స్ ల ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు : ఆసుపత్రి సూపరింటెండెంట్
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ట్రాన్స్ జెండర్స్ ల ఆరోగ్య సమస్యల పై వైద్య ఆరోగ్య అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. హాస్పిటల్ నందు ట్రాన్స్ జెండర్స్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నారు. ధనవంత్రి హాల్ లో ట్రాన్స్ జెండర్స్ యొక్క పవర్ ప్రజెంటేషన్ ద్వారా కొన్ని సలహాలు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. ట్రానజెండర్స్ కావలసిన ప్రత్యేక ఆరోగ్య అవసరాలకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చిన నిర్భయంగా ఆసుపత్రికి వచ్చి సేవలు పొందవచ్చని వెల్లడించారు. ప్రతి ఒక్కరు AIDS మీద అవగాహన ,HIV పరీక్షలు చేయించుకొని మీ జీవితాన్ని HIV బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి డా.ఎల్.బాస్కర్, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు TB అధికారి, డిప్యూటీ CSRMO, డా.హేమనలిని, ARMO డా.వెంకటరమణ, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రిబాయి, నర్సింగ్ సిబ్బంది, ట్రాన్స్ జెండర్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నట్లు డా.ప్రభాకర రెడ్డి తెలిపారు.