తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన మను భాకర్

పారిస్ ఒలింపిక్స్‌:  భారత షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది . మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్‌ చరిత్రలో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను రికార్డు సృష్టించింది.ఫైనల్లో 221.7 పాయింట్లతో కాంస్యం సాధించింది. ఫైనల్లో మను భాకర్ వియత్నాం, టర్కీ, కొరియా, చైనా, హంగేరీ ఆటగాళ్లతో తలపడింది. ఈ ఈవెంట్‌లో కొరియాకు చెందిన ఓహ్ యే జిన్ స్వర్ణం సాధించింది. 243.2 పాయింట్లు సాధించి ఒలింపిక్ రికార్డు సృష్టించాడు.

పారిస్‌ ఒలింపిక్స్‌ తొలిరోజు సాయంత్రం భారత్‌ నుంచి శుభవార్త అందింది. ఒకవైపు వెటరన్ షూటర్లు భారత్‌ను నిరాశపరచగా, మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 580 మార్కులతో మూడో స్థానంలో నిలిచింది.

Author

Was this helpful?

Thanks for your feedback!