పొఖ్సో చట్టం మీద అవగాహన  సదస్సు

  పొఖ్సో చట్టం మీద అవగాహన  సదస్సు

న్యూస్ వెలుగు, కర్నూలు; భారత్ ప్రచారం లో భాగంగా బుధవారం  జి

ల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ జి.కబర్ది,న్యాయసేవ అధికార కార్యదర్శి బి . లీలా వెంకట శేషాద్రి న్యాయ సేవా సదన్ నందు బాల్య వివాహా నిరోధక చట్టం, పొఖ్సో చట్టం మీద అవగాహనా సదస్సు నిర్వించారు.అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ బాల్య వివాహాలు ఒక దురాచారం మరియు నేరం అని బాల్య వివాహాలు బాలికల విద్య,రక్షణ, ఆరోగ్యం  అభివృద్ధికి ఆటంకం అని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ గ్రామంలో సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా నిరోధించేలా కృషి చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా న్యాయ సేవ సదన్ నందు బాల్య వివాహ వ్యతిరేక ప్రతిజ్ఞను నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్డి గారు జెండా ఉూపి ర్యాలి ని ప్రారంభించి కొండా రెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ కొవ్వొత్తుల తో మానవ హారాన్ని ఏర్పాటుచేసి ICDS ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట లక్ష్మమ్మ, కర్నూలు CDPO అనురాధ, గర్ల్ చైల్డ్ డెవప్మెంట్ ఆఫీసర్(ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్) స్నేహాలత, కర్నూలు జిల్లా డి.సి.పి.ఓ. శారదా, CWC చైర్మన్ జుబేదా బేగం, బాలల పరిశీలన అధికారి హుస్సేన్ బాష, నవయుత చైల్డ్ రైట్స్ ఫోరమ్ NGO లక్షి నారాయణ, లయన్స్ క్లబ్ NGO రాయపాటి శ్రీనివాసులు,టౌన్ మోడల్ స్కూల్ స్కౌట్ విద్యార్థులు మరియు అంగన్వాడీ వర్కర్లు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!