పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వర్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ డిమాండ్.

హోళగుంద,న్యూస్ వెలుగు: పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమానుల్లా ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై 9,412 కోట్ల చార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆలూరు కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.ఇప్పటికే విధించిన 6,029 కోట్ల ట్రూ అప్ చార్జీలు అసలు డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభం కాగా మళ్లీ సామాన్యుడి పై ఈ భారం వేయడం దారుణం,కనీసం పబ్లిక్ హియరింగ్ కూడా నిర్వహించకుండా ఏకపక్షంగా ట్రూ అప్ విధించడం అన్యాయం,చట్ట విరుద్ధం పారదర్శకత గురించి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇలాంటి నిరంకుశ పోకడలకు స్వస్తి పలకాలని,ఎన్నికల హామీలను తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే భూమిని వాగ్దానం చేసిన కూటమి గద్దెనెక్కాక మాట నిలబట్టుకోలేదు.ఎప్పుడూ వాడిన కరెంటుకు ఇప్పుడు అతను డబ్బులు చెల్లించాలన్న ట్రూ అప్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ వినంతి పత్రాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు లింగంపల్లి రామాంజనేయులు, హత్తిబెలగల్ ఖాదర్,మాజీ మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్,తిమ్మప్ప ఎమ్మార్పీఎస్ నాయకులు బాపురం మోషే,మొలగవెల్లి రామాంజనేయులు,జిలానీ,అరవింద్ కుమార్, వరకుమార్, తిమ్మప్ప,నవీన్,లింగప్ప,రమేష్,వెంకటేష్,వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!