గ్రామీణ క్రీడాకారుడికి ఘన సన్మానం

గ్రామీణ క్రీడాకారుడికి ఘన సన్మానం

అందరి చేత శబాష్ అనిపించుకున్న ఆటో డ్రైవర్ కోచ్చెర్వు నారాయణ స్వామి

న్యూస్ వెలుగు,  డోన్; ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ మండలం కోచ్చెర్వు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నారాయణ స్వామి స్ఫూర్తి సేవా సమితి సంస్థలో ముఖ్య సభ్యుడిగా సేవలు చేస్తున్నారు. అతనికి క్రీడలు అంటే చాలా ఇష్టం. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ దాతలు అందిస్తున్న సహకారంతో గత కొన్ని ఏళ్లుగా క్రీడా పోటీల్లో పాల్గొంటూ ఆడిన ప్రతి చోటా విజయం సాధించి పతకాలు , ప్రశంస పత్రాలు సాధించి సొంత ఊరికి డోన్ మండలానికి పేరు తెచ్చాడు. అందులో భాగంగా ఫిబ్రవరి లో అజ్మీర్ లో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని పోల్ వాల్ట్, లాంగ్ జంప్ విభాగల్లో రెండు కాంస్య పతకాలు సాధించారు. అజ్మీర్ కి వెళ్ళడానికి ఆర్థిక సాయం అందించిన డోన్ డీఎస్పి శ్రీనివాస్ కి నారాయణ స్వామి స్ఫూర్తి బృందంతో కలిసి కృతజ్ఞతలు ధన్యవాదములు తెలుపగా, క్రీడల్లో ఎంతో ఉత్సహంతో పాల్గొంటూ విజయం సాధిస్తున్న నారాయణ స్వామి ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. అనంతరం నారాయణ స్వామిని డోన్ డీఎస్పీ శ్రీనివాస్ , డోన్ టౌన్ సీఐ ఇంతియాజ్ బాష , డోన్ రూరల్ సీఐ రాకేష్, ప్యాపిలి సీఐ వెంకటరామిరెడ్డి, బనగానపల్లె సీఐ ప్రవీణ్ కుమార్ శాలువాతో ఘనంగా సన్మానించి, నారాయణ స్వామిని ప్రోత్సహిస్తున్న స్ఫూర్తి సంస్థ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సభ్యులు స్ఫూర్తి మధు, భాస్కర్, మోహన్ రెడ్డి, చిట్యాల మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS