కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పై చర్యలు తీసుకోవాలి

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పై చర్యలు తీసుకోవాలి

డోన్ లోని కొత్తకోట గ్రామములో అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసనతెలియ చేసి గ్రామసర్పంచ్ కు వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపిన సీపీఐ, సిపిఎం,బిఎస్పి,ఆర్పి.ఐ( ఏ ),దళిత, గిరిజన, బహుజన,డి వై ఎఫ్ ఐ సంఘాలు

డోన్, న్యూస్ వెలుగు;  బి.ఆర్ అంబేద్కర్ ని  భారత రాజ్యాంగాన్ని , బీజేపీ ప్రతిసారి అవహేళన చేస్తోంది అమిత్ షా వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి..డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి డోన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త (ఇంచార్జ్),& డిసిసి ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్ సంఘీభావం ప్రకటించి నిరసన కార్యక్రమములో పాల్గొన్న సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు, నారాయణ,మోటా రాముడు,సిపిఎం డోన్ మండల కార్యదర్శి కె. నాగరాజ్,నక్కి శ్రీకాంత్,బిఎస్పీ నాయకులు విజయ్ భాస్కర్, ఆర్ పి ఐ జిల్లా నాయకులు చిరంజీవి,సామజిక కార్యకర్త ఏ ఇ నాగరాజ్,డివైఎఫ్ఐ,నక్కి హరి ఎమ్మార్పీఎస్ కొత్తకోట గ్రామ నాయకులు లక్ష్మన్న

లోకసభ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాగారు డా. బి.ఆర్ అంబేడ్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, అమిత్ షా ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, పీసీసీ, డిసిసి పిలుపుమేరకు డోన్ నియోజకవర్గం లోని డోన్ మండలంలోకొత్తకోట గ్రామములో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టి స్థానిక సర్పంచ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, ఆర్ పి ఐ (ఏ ),దళిత, బహుజన,గిరిజన, డి వై ఎఫ్ ఐ సంఘాలు నిరసన లో పాల్గొని మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ దేశములో రాజ్యాంగ ప్రమాదములో పడిందని, బీజేపీ అధికారములోకి వచ్చిన తరువాత మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నాయని, దళిత గిరిజనులపై దాడులు రోజు, రోజు కు పెరుగుతున్నాయని,భారత రాజ్యాంగాన్ని నిర్మించిన ప్రపంచ మేధావిని పార్లమెంట్ లో అవమానించిన కేంద్ర హోం మంత్రి పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండడం దేనికి నిదర్శనం.
అదేవిందంగా అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్రంలోని పార్టీలు టిడిపి, జెనసేన, వైకాపా స్పందించకపోవడం వారి ద్వంద వైఖరికి నిదర్శనం, ఈ పార్టీలకు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అంబెడ్కర్ గుర్తొస్తాడు ఆయన పేరుని వాడుకుంటారు.
అంబేద్కర్‌గారిని హేళన చేస్తే ఊరుకోబొమని ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.
అంబేద్కర్‌, అంబేద్కర్‌, అంబేద్కర్‌, అంబేద్కర్‌ – ఈ మధ్య అంబేద్కర్‌ పేరు జపించడం ఫ్యాషన్‌ అయిపోయిందని . అన్నిసార్లు భగవంతుడి పేరు గనక తలుచుకుంటూ ఉంటే, రాబోయే ఏడేడు జన్మల్లో స్వర్గం ప్రాప్తించేది!”అని అన్నటువంటి అమితాషా వ్యాఖ్యల సమాజం ఖండించాలని వారు పిలుపునిచ్చారు.
మన రాజ్యాంగం స్థానంలో మనుస్మతిని ప్రవేశపెట్టాలనుకున్న ఆరెస్సెస్‌ – బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో తగినంత మెజారిటీ రాకపోవడం పై ఆసహనంగా ఉంది కాబట్టి . రాజ్యాంగాన్ని మార్చాలని అనుకున్న తమ కల నేరవేరడం లేదన్న అక్కసుతో ఉంది అనడానికి అంబేద్కర్‌పై వెళ్ళగక్కుకున్న అమిత్ షా మాటలే నిదర్శనమని ఈ దేశానికి అన్యాయంజరుగుతుంటే ప్రజలు చూస్తూ ఉండరని రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని వారు అన్నారు
అదేవిందంగా గుజరాత్‌ మారణ హోమానికి ప్రధాని మోడీ జవాబు చెప్పరు,మణిపూర్‌ మారణ హోమానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదు. అసలు మణిపూర్‌ ఈ దేశంలోని భాగం కాదన్నట్టుగా వ్యవహరిస్తారు. అక్కడ మహిళల్ని నగ్నంగా ఊరేగించడం లాంటి పరిణామలను చూస్తుంటే భారతదేశంలో ఉన్నమా లేక వేరే అనాగా రిక దేశములో ఉన్నామా అని అనుమానం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
”దేశంలో స్వాతంత్య్ర స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న ప్రతి భారతీయుడు ఆరాధించే వ్యక్తి బాబా సాహెబ్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ అని ఆయన పేరు పలకడానికి గుండె, పెదాలూ ఉవ్విళ్ళూరుతుంటాయని అలాంటి అంబేద్కర్‌ను అగౌరవ పరచడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని . అమితాషాకు, ఆయన పార్టీ వారికీ ఇష్టం ఉన్నా లేకున్నా ఈ దేశ ప్రజల్లో అత్యధికులు అంబేద్కర్‌ పేరును స్మరిస్తూనే ఉంటారు” అని వారు అన్నారు. ఈ కార్యక్రమములో డోన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త (ఇంచార్జ్) డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి,సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు, డిసిసి ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, గ్రామసర్పంచ్ వి చంద్రన్న, సిపీఐ మండల డోన్ కార్యదర్శి నారాయణ, డోన్ పట్టణ కార్యదర్శి మోటా రాముడు,సిపిఎం డోన్ మండల కార్యదర్శి కె. నాగరాజ్,పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్,బిఎస్పీ రాష్ట్ర నాయకులు విజయ్ భాస్కర్, ఆర్ పి ఐ జిల్లా నాయకులు చిరంజీవి,సామజిక కార్యకర్త ఏ ఇ నాగరాజ్ గౌడ్, డివైఎఫ్ఐ నాయకులు నక్కి హరి, శివరాముడు,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆర్ గోపీనాథరావు,మైనారిటీ అధ్యక్షులు హుస్సేన్,కాంగ్రెస్ పార్టీ డోన్ పట్టణ అధ్యక్షులు పి.హనుమాన్, కాంగ్రెస్ పార్టీ డోన్ మండల ఉపాధ్యక్షులు పి సురేష్, పి తిమ్మరాజు, కాంగ్రెస్ నాయకులు వినీత్ భార్గవ్, హర్షద్ ఎమ్మార్పీఎస్ కొత్తకోట గ్రామ నాయకులు లక్ష్మన్న,వెంకటేష్,నాయకులు,రంగన్న, శ్రీనివాసులు,ఎస్ నాగేంద్ర, ఎస్ రమణయ్య, పెద్ద వెంకటేష్, వై.సంజీవ్,ఎస్ తిరుపాల్,ఆర్. తిరుపాల్,వెంకటస్వామి, బి రంగన్న, సత్య, రామాంజనేయులు, పెద్ద దస్తగిరి, మధు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!