డోన్, న్యూస్ వెలుగు : డోన్ పట్టణంలోని కొత్త బస్టాండ్‌ను గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు

అందుతున్న సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, వాహనాల రాకపోకలు ఇతర మౌలిక వసతులను ఎమ్మెల్యే పరిశీలించారు.ఈ సందర్భంగా బస్టాండ్ పరిసరాల పరిశుభ్రత,క్యాంటీన్లో ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, టాయిలెట్స్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు నిరంతరం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక ప్రజలు, ప్రయాణికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
Thanks for your feedback!