నంద్యాల, న్యూస్ వెలుగు : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల అధ్యక్షుడు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఎంపీడీవో గాయత్రి ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులు తమ అభివృద్ధి పనులను వివరించారు. ఇందులో భాగంగా ముందుగా పిఆర్ఏఈ ప్రభుత్వం తరఫున మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. నిర్మాణంలో పూర్తి గాని ప్రభుత్వ కార్యాలయాలను త్వరలో పూర్తి చేయాలని ఎంపీపీ ఆదేశించారు. ఉపాధి హామీ ఏపీవో వసుధ మాట్లాడుతూ.. మండలంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని అవసరం మేరకు జాబ్ కార్డులు మంజూరు చేస్తున్నామని ప్రతి ఒక్కరికి జాబ్ కార్డుతో ఉపాధి కల్పించుటకు కృషి చేస్తున్నామని,

గత సంవత్సరం వేసవిలో పశువులకు నీటి దాహం తీర్చుటకు నిర్మించిన పశువుల నీటి తొట్లలో ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు నీటిని పోయించాలని ఏపీవో తెలిపారు. మండలంలో రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ అయ్యాయని అందులో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఇంకా ఎవరికైనా జమ కాని పక్షంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని రాబోవు ఖరీఫ్ సీజన్లో చేపట్టాల్సిన వ్యవసాయం గురించి మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తెలిపారు. చెరువులు కుంటాలను ప్రక్షాళన చేసి జలధార నీటి భద్రతను నిర్వహిస్తామని చెరువులు కుంటలు ఆక్రమణకు గురికాకుండా తగు చర్యలు తీసుకుంటామని మైనర్ ఇరిగేషన్ శాఖ ఏఈ అర్జన్ సింగ్ తెలిపారు. పశువుల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిందని అందుకు అనుగుణంగా ఇటీవల మండలంలోని పశువులన్నిటికీ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించడం జరిగిందని అలాగే పశువులకు ఇన్సూరెన్స్ కూడా చేయించామని వెటర్నరీ డాక్టర్. అనూష తెలిపారు. పొదుపు మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నామని ఒక శ్రీనిధి రుణాల మంజూరులో జాప్యం జరుగుతున్నదని మిగతా అన్ని విషయాలలో 100% పొదుపు మహిళలకు ఆర్థికంగా రుణాలు మంజూరు చేస్తున్నామని ఏపీఎం గుర్రప్ప తెలిపారు. మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ్ కార్యక్రమం కింద చిన్నారులకు బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నామని అదేవిధంగా కొన్ని గ్రామాలలో అంగన్వాడీ హెల్పర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కొన్ని అంగన్వాడి కేంద్రాలు మౌలిక వసతులు లేవని ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి తెలిపారు. మండలంలో బండి ఆత్మకూరు పిహెచ్సి పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఇందులో భాగంగా హెచ్ పి వి టీకాలు 14 నుండి 15 సంవత్సరముల లోపల బాలికలకు ఉచితంగా అందజేస్తున్నామని గర్భస్థ ముఖద్వారా క్యాన్సర్ నివారణకు ఈ టీకాలు ఉపయోగపడతాయని ప్రజలు ఎటువంటి అపోహలకు గురికాకుండా టీకాలు వేయించుకోవాలని ఇప్పటివరకు మండలంలో 120 మంది బాలికలకు టీకాలు వేసినట్లు డాక్టర్. భావన తెలిపారు. మండలంలో ప్రభుత్వం తరఫున ప్రజలకు సకాలంలో విద్యుత్ సేవలు అందజేస్తున్నామని ఇందులో భాగంగా సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ సెట్లను సబ్సిడీ ద్వారా విద్యుత్ వినియోగదారులకు అందజేస్తున్నామని అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వారికి ఉచితంగా సూర్యా గర్ పథకం కింద సోలార్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని అనుమతులు వచ్చాక చేస్తామని ఏఈ కంబగిరి తెలిపారు. గ్రామాలలో సర్పంచ్ల పదవీకాలం ముగింపు కావడంతో పంచాయతీ కార్యదర్శులు మండల స్పెషల్ ఆఫీసర్ల సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టాలని డిప్యూటీ ఎంపీడీవో పురుషోత్తం తెలిపారు. ప్రస్తుతం మండలంలో రైతులకు ప్రభుత్వ రాజముద్ర తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని రైతుల సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని తహశీల్దార్ పద్మావతమ్మ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ప్రభుత్వం విద్యార్థులకు చక్కటి వసతులతో కూడిన విద్యను అందిస్తుందని ప్రతి విద్యార్థికి అమ్మవారి పథకం లబ్ధి చేపడుతుందని, మండలంలో 10వ తరగతి పరీక్షలు విజయవంతంగా ముగించామని మండలంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించడంలో ఉపాధ్యాయులు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఎంఈఓ యశోద తెలిపారు. మండలంలో హౌసింగ్ లబ్ధి గురించి వివరిస్తూ ఇల్లు కట్టుకునే వారికి బీసీలకు 30000 ఎస్సీ 50,000 చెంచు గిరిజనులకు లక్ష రూపాయలు అదనంగా ప్రభుత్వం అందజేస్తుందని ప్రస్తుతం కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి ఉత్తర్వులు రాలేదని త్వరలో ఉత్తర్వులు వచ్చాక తెలియజేస్తామని హౌసింగ్ ఏఈ వాసుదేవుడు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా సమస్యలు ఏమన్నా ఉంటే తెలపాలని ఆర్టీసీ నంద్యాల డిపో అధికారి వెంకటేష్ రెడ్డి తెలపగా పలువురు మండల స్థాయి అధికారులు, జూటూరు సొసైటీ చైర్మన్ సాయిబాబా రెడ్డి ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు అవసరమైన చోట నిలపకుండా వెళ్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలో ఐకమత్యంగా అభివృద్ధిని సాధించాలని సమస్యలు ఏమైనా ఉంటే ఒకరికొకరు సహకరించుకొని పరిష్కరించుకోవాలని, అయ్యవారి కోడూరు గ్రామంలో నీటి సమస్య పై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఎంపీపీ పండ్స్ తో ఇంకొక మోటార్ ను స్పేర్ గా అందజేస్తామని, ముఖ్యంగా గ్రామాల్లో మంచినీటి త్రాగునీటి సమస్యలు ఉంటే పరిష్కరించాలని, వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా కృషి చేయాలని ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి ఆదేశించారు. మండల సర్వసభ్య సమావేశానికి నిర్ధారించిన 22 మంది మండల స్థాయి అధికారులకు 14 మంది మండల స్థాయి అధికారులు సర్వసభ్య సమావేశంలో పాల్గొని తమ నివేదికలను విన్నవించారు. మిగతా పదిమంది మండల స్థాయి అధికారులు ఒకరిద్దరు హాజరైనప్పటికీ వారి నివేదికలను వెల్లడించాలని ఎంపీడీవో తెలుపలేదు. మిగతా 8 మంది మండల స్థాయి అధికారులు వివిధ కారణాలతో సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదు. వైస్ ఎంపీపీలు మధురాణి, రాగాల రమణ, సొసైటీ చైర్మన్ సాయిబాబా రెడ్డి, ఏవో శ్యామల, జిఎస్ డబ్ల్యూఎస్ ఎంపీడీవో చంద్రమౌళి, జెడ్పిటిసిలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Thanks for your feedback!