ఈనెల 09 నుండి 26 వరకు స్పెషల్ ఆధార్ క్యాంపులు

ఈనెల 09 నుండి 26 వరకు స్పెషల్ ఆధార్ క్యాంపులు

నంద్యాల, న్యూస్ వెలుగు : బండి ఆత్మకూరు మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 09 నుండి 13 వరకు స్పెషల్ ఆధార్ క్యాంపుల కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గాయత్రి తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 9న సింగవరం మదర్ తెరిసా స్కూల్ నందు, 10న నాయిని చెరువు, మణికంఠపురంలో 11న నారాయణపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు, 12న బండి ఆత్మకూరు భవిష్య స్కూల్ నందు, 13న ఈర్నపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 23న బండి ఆత్మకూరు ఎంపీపీఎస్ మెయిన్ స్కూల్ నందు, 24 న పెద్దదేవలాపురం ఎంపీపీఎస్ స్కూల్ నందు, 25న ఎర్రగుంట్ల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 26 న జి లింగాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS