రీ సర్వే ఎస్ఓపి (స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్) ప్రకారం పొరపాట్లకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియను చేయాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు; రీ సర్వే ఎస్ఓపి (స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్) ప్రకారం పొరపాట్లకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు.. బుధవారం

కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ నిర్వహణపై రెవెన్యూ మరియు సర్వే సిబ్బందికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ కింద ప్రతి మండలంలో ఒక గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద రీ సర్వే ప్రక్రియ జరుగుతోందన్నారు. రీ సర్వే కి సంబంధించిన ఎస్ఓపి (స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్)ను వీఆర్వో లు, సర్వేయర్ లు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని రీ సర్వే ప్రక్రియ నిర్వహిస్తే పొరపాట్లకు ఆస్కారం ఉండదని కలెక్టర్ పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ నిర్వహణపై రెవెన్యూ మరియు సర్వే సిబ్బందికి డివిజన్ స్థాయిలో కూడా శిక్షణ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓ లను ఆదేశించారు..సచివాలయంలో ఉన్న మ్యుటేషన్, ఎఫ్ లైన్ పిటిషన్ లకు సంబంధించి అర్జీదారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతోందన్నారు.. ఐవిఆర్ఎస్ ద్వారా, సీసీఎల్ ఏ, కలెక్టరేట్ నుండి అర్జీ దారులకు ఫోన్ చేసి మీ సేవ ఫీజ్ కాకుండా అదనంగా డబ్బు చెల్లించారా, రీ సర్వే సమయంలో తహసీల్దార్లు ప్రజలకు నోటీసులు ఇస్తున్నారా?వీఆర్వోలు ఫీల్డ్ కి వచ్చి ఎంక్వైరీ చేశారా? అని ఫీడ్ బ్యాక్ ను సేకరించడం జరుగుతోందన్నారు..ఫీడ్ బ్యాక్ నెగెటివ్ గా ఉందని, ఈ అంశానికి సంబంధించి పొరపాట్లు చేసిన సిబ్బంది మీద చర్యలు తీసుకుంటున్నామన్నారు.. మ్యుటేషన్, ఎఫ్ లైన్ అర్జీలను ప్రొసీజర్ ప్రకారం సక్రమంగా చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..డబ్బు అడిగినా, నోటీసులు ఇవ్వక పోయినా, ఫీల్డ్ కు వెళ్ళకుండా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు..ఒక ఆస్తి బదలాయింపు లో ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయని, ఈ ప్రక్రియ చేసేటపుడు అధికారులు చాలా జాగ్రత్తగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. యాంత్రికంగా చేయకూడదని, నియమ నిబంధనల ప్రకారం సర్వే ప్రక్రియను చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. ఎఫ్ లైన్ పిటిషన్ లకు సంబంధించి విలేజ్ సర్వేయర్ లు ప్రజలకు నోటీస్ లు ఇవ్వకుండా ఎఫ్ఎమ్బి లో అప్లోడ్ చేయకూడదన్నారు.. ఒకవేళ నోటీసులు ఇచ్చినా రాని పక్షంలో నోటీస్ లు సర్వ్ చేసిన ఫోటో, ఫీల్డ్ కి వెళ్లిన ఫోటో, స్టేట్మెంట్ రికార్డు చేసిన ఫోటోలను వెబ్ ల్యాండ్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు..జిఓ ఎమ్ ఎస్ నెంబర్ 30 ప్రకారం అనధికారిక మరియు అభ్యంతరం లేని ఆక్రమణల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు..వెంటనే ఈ అంశంపై సర్వే నిర్వహించి, ఇలాంటి వారిచే ఆన్లైన్ లో దరఖాస్తులను చేయించాలన్నారు… ఈ అంశం పై విఆర్ఓ లకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ తహసీల్దార్ లను ఆదేశించారు..
రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలు, రీ సర్వే గ్రామ సభల్లో వచ్చిన అర్జీల పరిష్కారాన్ని బాగా చేశారని కలెక్టర్ తెలిపారు.. పిజిఆర్ఎస్ కి సంబంధించిన అర్జీలలో మాత్రం ఎండార్స్మెంట్ సరైన రీతిలో ఇవ్వడం లేదన్నారు…అర్జీ దారులు పదేపదే వచ్చినప్పటికీ వారి సమస్యను అర్థం చేసుకోకుండా ఉంటే ఎలా అని కలెక్టర్ తహసీల్దార్లను ప్రశ్నించారు..పరిష్కారంలో నాణ్యత ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.. ఆర్ ఎస్ ఆర్, అడంగల్, 1బి, ఎఫ్ఎంబి, రికార్డు ఆఫ్ రైట్స్ గురించి కలెక్టర్ క్షుణ్ణంగా వివరిస్తూ, వీటిపై రెవెన్యూ అధికారులకు పూర్తి అవగాహన చాలా అవసరమని కలెక్టర్ తెలిపారు..ఆర్ ఎస్ ఆర్, అడంగల్ లలో భూమి విస్తీర్ణం ఒకే విధంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు..అర్హత ఉండి ఇంటి స్థలం లేని వారిని గుర్తించేందుకు విఆర్ఓ లు సర్వే చేయాలని, అందుకు సంబంధించిన గైడ్లైన్స్ చదవాలని కలెక్టర్ ఆదేశించారు…జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య మాట్లాడుతూ మన జిల్లాలో పైలెట్ గ్రామాలుగా 25 గ్రామాలను ఎంపిక చేసుకుని రీ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఈ 25 గ్రామాలలో గ్రామ సరిహద్దులను ఏర్పాటు చేశామని, పత్తికొండ డివిజన్లో ఐదు గ్రామాల్లో బ్లాక్ బౌండరీ చేయలేదని, బ్లాక్ బౌండరీని రెండు రోజుల్లో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ పత్తికొండ డిఐఎస్ఓ ను ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్ లో చాలా వెనుకబడి ఉన్నామని, రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్ కు షెడ్యూల్ వేసుకోవాలని , అదేవిధంగా షెడ్యూల్ ప్రకారం రెండు లేక మూడు రోజులు ముందు రైతులకు నోటీసులు సర్వ్ చేయాలని, ఏ సర్వే నెంబర్లు ఎప్పుడు చేస్తామన్నది ముందుగానే తెలియజేయాలని జేసీ అధికారులను ఆదేశించారు..
సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్టీవో సందీప్ కుమార్, ఎడి సర్వే మునికన్నన్, అన్ని మండలాల తహసీల్దార్లు, వీఆర్వో, విలేజ్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు..
Thanks for your feedback!