వినేశ్ అనర్హతపై లోక్‌సభలో ప్రకటన
Delhi (ఢిల్లీ ): వినేశ్ అనర్హతపై లోక్‌సభలో కేంద్రమంత్రి మాండవీయ ప్రకటనచేశారు. 100 గ్రాముల అదనపు బరువు కారణంగా వినేశ్ అనర్హతకు గురైనట్లు తెలిపిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ వ్యవహారంపై ‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్’ వద్ద భారత ఒలింపిక్ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. తగు చర్యలు తీసుకోవాలని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషకు ప్రధాని మోదీ సూచించారు . వినేశ్ ఫొగాట్ సన్నద్ధత కోసం ప్రభుత్వం అన్ని రకాల సాయాన్ని అందించిందని కేంద్ర మంత్రి మాండవీయ లోకసభ కు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!