
పాలూరు ,సుద్ధపల్లె గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ
పెద్దముడియం, న్యూస్ వెలుగు; పెద్దముడియం మండలంలోని పాలూరు, సుద్ధపల్లె గ్రామ పంచాయతీలో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. పాలూరు గ్రామ పంచాయతీకి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 12 లక్షల 50 వేల రూపాయలు మంజూరు అయినది అలాగే సుద్ధపల్లి గ్రామపంచాయతీ నందు 26 లక్షల రూపాయలతో నాలుగు సిమెంట్ రోడ్ల నిర్మాణాలు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం ఎంపీడీవో గారు చేతుల మీద చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ పాలూరు మరియు సుద్దపల్లి గ్రామపంచాయతీ నందు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధుల ద్వారా మంజూరు చేసిన సిమెంట్ రోడ్ల నిర్మా ణము మరియు ఎంపీపీ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణము త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్థానిక నాయకులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలూరు గ్రామం కూటమి నాయకులు మరియు సుద్ధపల్లి గ్రామం పంచాయతీ నందు గ్రామ నాయకులు పాల్గొనడం జరిగినది.