
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కిషోరి వికాసం కార్యక్రమం
పెద్దముడియం, న్యూస్ వెలుగు; మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కడప డి .శ్రీలక్ష్మి గారి ఆదేశాల మేరకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో కిషోరి వికాసం కార్యక్రమం లో భాగంగా Dr.BR అంబేద్కర్ గురుకుల పాఠశాల, గుండ్లకుంట పెద్దముడి మండలం యందు విద్యార్థులకి చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, మంచి స్పర్శ చెడు స్పర్శ, బాలలకు సంబంధించిన చట్టాలతో పాటు మిషన్ వాత్సల్య పథకం ద్వారా అందిస్తున్న సేవల గురించి అవగాహన ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ రాజేశ్వరి దేవి గారు మాట్లాడుతూ పిల్లలు కౌమర దశలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తెలియజేయడంతో పాటు సత్ప్రవర్తనతో ఉండాలని తెలియజేశారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ మహేష్ మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు పిల్లల కోసం బాలల నాయక్ చట్టం ఉందని, పిల్లలు అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని అటువంటి వాటి బారిన పడకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేస్తూ సమాజం లో జరుగుతున్న పరిస్థితులు పట్ల అవగాహనతో మెలగాలని పిల్లలు ఆపద సమయంలో 1098ద్వారా సహాయం పొందవచ్చు అని తెలియజేశారు ఏ కార్యక్రమం నందు ఐసిడిఎస్ సూపర్వైజర్ సైరాబాను, హేమలత పాఠశాల ప్రిన్సిపల్, పద్మావతి గారు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.