
రుద్రవరంలో శుభ్రత హరిత కార్యక్రమాలు విజయవంతం – ఆర్యూ NSS యూనిట్ 4
కర్నూలు, న్యూస్ వెలుగు: శనివారం రుద్రవరం గ్రామంలో స్వచ్ఛత మరియు హరిత కార్యక్రమాన్ని ఆర్ యు సి యూనిట్ 4 విద్యార్థులు విజయవంతంగా నిర్వహించారు. ప్రారంభంలో గ్రామంలోని పాఠశాలను సందర్శించి, పాఠశాల ఆవరణ మరియు పరిసరాలను శుభ్రంగా శుభ్రపరిచారు . దీని ద్వారా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ,ఆహ్లాదకరంగా మారాయి. తదుపరి ,పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహంగా పాఠశాల పరిసరాల్లో మరియు సమీప ప్రాంతాల్లో మొక్కలు నాటిన. అనంతరం ,పోలియో చుక్కల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. గ్రామ వీధిలో గుండా ర్యాలీ నిర్వహించి, పిల్లలకు పోలియో చుక్కలు వేయడం ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పించారు. చివరిగా ,ఒక చిన్న వీధిలోని ఒక స్థలంలో పిల్లలను సమీకరించి ,వారి తల్లిదండ్రులకు పోలియో చుక్కల అవసరాన్ని ,స్కిట్ రూపంలో చూపించి వివరించడం జరిగింది. సచివాలయం దగ్గర ఉన్న ఒక దేవాలయాన్ని పూర్తిగా శుభ్రం చేసి ,అక్కడి నుంచి వచ్చిన చెత్తను అంతసేకరించి గ్రామం బయటకు తరలించారు. మురికి కాల్వలో చెత్త పరిశుభ్రంగా చేసి వీధులలో బ్లీచింగ్ పౌడర్ చల్లి.అనంతరం శ్రీ శివాలయానికి వెళ్ళాము అక్కడ చెత్త తో నిండిన ఒక భావి ఉండగా ,దాని పరిసరాలను పూర్తిగా శుభ్రపరిచి అలాగే దేవాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశారు ఆర్ యు సి యూనిట్ 4 విద్యార్థులు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కార్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ .ఎస్ .నాగచంద్రుడు ఎన్ఎస్స్ ఆఫీసర్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

