
వ్యవసాయంలోనూ మహిళలదే కీలకపాత్ర : రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి జగన్నాథం
కర్నూలు న్యూస్ వెలుగు : వ్యవసాయ రంగంలో మహిళ రైతులే ముఖ్య పాత్రని ఆధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో గురువారం కర్నూలు నగరంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే జగన్నాథం తెలిపారు. మహిళలు వ్యవసాయం సహా అనేక రంగాల్లో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి. శ్రావణి రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మహిళా రైతులకు సరైన శిక్షణ ఇస్తే వ్యవసాయ దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయంలో అత్యధికంగా మహిళలే పని చేస్తారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. వ్యవసాయం సహా వ్యవసాయ రంగ అనుబంధ రంగాలలో సైతం మహిళలు కీలకపాత్ర పోషించడం ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషించడం జరుగుతుందని వారు వెల్లడించారు. అలాంటి రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాలలో శిక్షణను ఇవ్వడంతో పాటు వారికి గుర్తింపును కూడా ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు దీనివల్ల దిగుబడి సహా అనేక రంగాల్లో మెరుగైన అభివృద్ధి కి దోహదపడతారన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ సహా విత్తన ఉత్పత్తి, పాలు పండ్లు కూరగాయలు సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే గ్రామీణ స్థాయి నుంచి మహిళ రైతులకు సరైన గుర్తింపు శిక్షణ అవకాశాలను ప్రభుత్వం నిర్వహించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రైతులకు వ్యవసాయంలో శాస్త్ర సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకునేలా రాయితీలు సబ్సిడీలు సాంకేతిక శిక్షణ తరగతులు వంటి అవకాశాలను కల్పించాలన్నారు. మేకలు గొర్రెలు కోళ్ల పెంపకంలోనూ మహిళ రైతులకు సరైన అవకాశాలు ప్రభుత్వం అందించాలన్నారు దీనివల్ల మహిళలు అన్ని రంగాలలో రాణించడానికి ఇది అవకాశం గా ఉండటమే కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధిలోనూ వారిది కీలకపాత్ర పోషించనున్నట్లు వారు వెల్లడించారు. వ్యవసాయంలో అత్యధిక ఫలితాలు సాధించే మహిళ రైతులకు సరైన న్యాయం దక్కడం లేదని అధిక సమయం వ్యవసాయంలోనే మహిళా రైతులు పని చేస్తున్నట్లు తెలిపారు. అధిక దిగుబడులు సాధించే మహిళ రైతులను ప్రభుత్వం గుర్తించి వారిని సత్కరించాలని ప్రతి నియోజకవర్గంలోనూ మహిళ రైతులకు ప్రత్యేక గౌరవ సత్కారాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దంభోళం శ్రీనివాసరావు మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు S.గిడ్డమ్మ నగర కార్యదర్శి భారతి కల్లూరు మండల రైతు సంఘం కార్యదర్శి బి రాముడు అధ్యక్షులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలుజిల్లా సహాయ దంభోళం శ్రీనివాసరావు: సెల్లు.9440487157

