
మెడికల్ మాఫియాను అరికట్టాలి: సీపీఐ
కర్నూలు న్యూస్ వెలుగు : కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు కే రామాంజనేయులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వైద్య విధానంలో అనేక అవకతవకలతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల పనితీరు సైతం అస్తవ్యస్తంగా ఉందని వారు అన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో ఇష్టమొచ్చినట్లుగా ఫీజులను వసూలు చేయడమే కాకుండా అవయవ దానాల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీలు జరుగుతున్నట్లు వారు ప్రభుత్వం పై మండిపడ్డారు. అమాయకులైన నిరక్షరాశులయిన బాధిత రోగులను ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయన్నారు దీనివల్ల ఆయా కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవలను సైతం సరిగా రోగులకు అందకపోవడం బాధాకరమన్నారు. ఇదిలా ఉండగా వైద్యులు సైతం అనేక ప్రైవేట్ ఆస్పత్రులను ఏర్పాటు చేసుకొని డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారని నకిలీ మందులు వ్యాక్సిన్లను ఇచ్చుకుంటూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. చట్టసభల్లో తిరుమల కల్తీ లడ్డు పై మాట్లాడిన ప్రజా ప్రతినిధులు ప్రజల ఆరోగ్యం పై ఎందుకు చర్చించలేక పోతున్నారని ఆయన ప్రశ్నించారు.ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో కల్తీ పాలు కల్తీ నీరు కల్తీ ఆహారం ఇలా చెప్పుకుంటూ పోతే దేనిలో కల్తీ లేదన్నది ప్రశ్నార్ధకంగా మారిందని చట్టసభల్లో వైద్య విధానం పై ప్రత్యేక చర్చ జరగాలని వారు ప్రభుత్వంలో డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జనరిక్ మెడిసిన్ లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం వైద్య విధానాల పైన ప్రత్యేక చర్చలు చట్టసభల్లో పెట్టాలని లేనిపక్షంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

