స్పందించకపోతే ఆందోళన చేస్తాం: చంద్రనాయక్

స్పందించకపోతే ఆందోళన చేస్తాం: చంద్రనాయక్

కర్నూలు ( న్యూస్ వెలుగు )మర్చి 23:  కళాకారుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర స్థాయి ఆందోళన తప్పదని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి చంద్రనాయక్ తెలిపారు సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.నాగరాజు అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్నాథం రామకృష్ణారెడ్డి మరియు ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి చంద్రనాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రకటిస్తున్నప్పటికీ కళా రంగానికి సరైన నిధులు కేటాయించకుండా కళాకారులను ఆదుకోవడానికి ఎటువంటి ప్రణాళిక రూపొందించడం లేదని ఈ సందర్భంగా విమర్శించారు. ప్రతి జిల్లాలో కళాక్షేత్రాలను నిర్మించాలని కళా రంగంపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్క కళాకారుడికి గుర్తింపు కార్డులు మంజూరు చేసి అర్హత కలిగిన పేద కళాకారులకు 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని అలాగే ఆర్టీసీ బస్సు చార్జీలు రాయితీ కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బయట రాష్ట్రాల నుండి కళాకారులను పిలిపించి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తప్ప స్థానికంగా రాష్ట్రంలో ఉన్న కళాకారులకు కళా ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లేకుండా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా విమర్శించారు స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పించాలన్నారు ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో అన్ని హంగులతో కూడిన కళాక్షేత్రాన్ని నిర్మించాలని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మినీ ఆడిటోరియాలు నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కళాకారుల సమస్యలు పరిష్కారం చేయటానికి అధికారులు కళాకారులతో ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి సంఘ బాధ్యులు జగన్నాథం సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి కోలాటం మాస్టారు మధు మాణిక్యం శివ శీను సుంకన్న జ్యోతిబాయ్ వరలక్ష్మి పార్వతి తదితర జానపద పౌరాణిక డప్పు తీన్మార్ కళాకారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించి సమస్యలను వివరించారు వారు సానుకూలంగా స్పందించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS