రామయ్య సన్నిధిలో 11వ బెటాలియన్ కమాండెంట్
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; రెండవ అయోధ్యగా పేరుపొందిన ఆంధ్ర భద్రాచలంగా పిలువబడే ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని సన్నిధికి శనివారం భాకరాపేట 11వ బెటాలియన్ కమాండెంట్ నాగేశ్వరప్ప సతీ సమేతంగా రావడం జరిగింది.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఆలయ ప్రదక్షణ గావిస్తూ అంతరాలయంలోకి తీసుకెళ్లి వారి వారి గోత్రనామాలతో జగదభిరామునికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ గావించి శాలువా పూలమాలతో సత్కరించి వేద ఆశీర్వచనం గావించారు. అనంతరం ఆలయ చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లె. బొబ్బిలి రాయుడు, టీటీడీ ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Was this helpful?
Thanks for your feedback!