
శ్రీనివాస థియేటర్ యాజమాన్యంపై ఫిర్యాదు
న్యూస్ వెలుగు డోన్ : డోన్ లోని శ్రీనివాస థియేటర్లో ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా టికెట్ల ధరలు మాత్రం ఆకాశాన్ని అందుతున్నాయని కాంగ్రెస్ నాయకులూ విమర్శించారు.
ఫైర్ కు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు మరియు మౌలిక వసతులను సమకూర్చలేదాని , శ్రీనివాస థియేటర్ పై తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు సుబ్బు యాదవ్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తెలుగు విజయ్ కుమార్ గురువారం ఆర్డిఓ కి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
డోన్ లో ఉన్నటువంటి శ్రీనివాస థియేటర్లో కూర్చోవడానికి కుర్చీలు సరిగ్గా లేకపోయినా, ప్రేక్షకులు వెళ్లడానికి బాత్రూంలో సరిగ్గా లేకపోయినా ఎటువంటి మౌలిక వసతులు లేకపోయినా రేట్ అఫ్ అడ్మిషన్ మరియు వారికి ఇచ్చినటువంటి పర్మిషన్స్ కంటే ఎక్కువగా ప్రేక్షకుల నుంచి వసూలు చేస్తున్న వాటి మీద చర్య తీసుకోవాల్సిన అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడం చాలా దుర్మార్గమన్నారు. హిట్ – 3 సినిమాకు కూడా అధిక ధరలు వసూలు చేస్తూ ఉన్నప్పటికీ వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం ఫై అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా థియేటర్ యాజమాన్యానికి మేలు చేసే దిశగా వారికి లాలూచీ పడుతున్నారే తప్ప ప్రేక్షకుల పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. వేల సంఖ్యలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తుంటే అక్కడ ఫైర్ కు సంబంధించినటువంటి ఎటువంటి జాగ్రత్తలు యాజమాన్యం తీసుకోలేదని అయితే వీటన్నిటిని చూసుకోవాల్సినటువంటి అధికారి మాత్రం నిద్ర మత్తులో ఉన్నారని వారు ఎద్దేవ చేశారు.
అయితే ఇప్పటికైనా ఆర్డీవో ఈ విషయంపై స్పందించి శ్రీనివాస థియేటర్ను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని, ప్రేక్షకులకు న్యాయం చేయాలన్నారు. సంబంధిత థియేటర్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేస్తామని వారు తెలియజేశారు.