పట్టణ ప్రజల సమస్యలను పరిస్కరించండి : సిపిఐ

పట్టణ ప్రజల సమస్యలను పరిస్కరించండి : సిపిఐ

డోన్ న్యూస్ వెలుగు :  డోన్ పట్టణం 16వ వార్డులో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని,  వైయస్ నగర్ శ్రీరామ్ నగర్ ఆటోనగర్ సుజాతనగర్ పలు శివారు ప్రాంతాల్లో సిసి రోడ్లు, కాలువలు వీధిలైట్లు సమస్యల పరిష్కరించాలని సిపిఐ 16వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ పి.సుంకయ్య  డోన్ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.  ఈ సందర్భంగా సుంకయ్య, మోట  రాముడు మాట్లాడుతూ 16వ వార్డు శిగరమాను పేటలో గుత్తి రోడ్డు నందు మసీదు దగ్గర నుండి భగత్ సింగ్ విగ్రహం వరకు మెయిన్ రోడ్ సైడ్ పెద్ద కాలువ వెంటనే నిర్మాణం చేయాలన్నారు.  పై  వీధుల నుండి మెయిన్ రోడ్డుకు  మురుగునీరు రావడం వలన వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.  ప్రజలు రోడ్డుమీదికి నీరు రావడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే పరిష్కారం చేయాలన్నారు.

  క్రిస్టియన్ సమాధుల దగ్గర  ప్రహరీగోడ ఇటివలి  కురిసిన భారీ వర్షం వలన కుంగి పోయిందని దానిని పునర్ నిర్మించాలని కోరారు.  శిఖరంపేట త్రివర్ణ కాలనీ హోసన్న మందిర్ వీడియోస్ కాలనీ మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న సర్వోత్తమ రెడ్డి నగర్ నందు కాలువలు వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు.  వైయస్ నగర్ ఆటోనగర్ పట్టణంలో శ్రీరామనగరు సుజాతమ్మ నగర్ పట్టణంలో శివారు ప్రాంతాలైన అన్ని ప్రాంతాల్లో కాలువలు  వీధిలైట్లు సిసి రోడ్లు ఏర్పాటు చేసి డస్ట్ బిల్లులు పెట్టిన ప్రాంతం మురుగునీరు నిలుచున్న ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని  దోమల నివారణకు ,  వీధి కుక్కలు విపరీతమైన సంఖ్య పెరిగిందని ప్రజలు  రోడ్లమీద కరవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.   పట్టణంలో హోటల్స్ సినిమా థియేటర్లు హాస్పిటల్స్ ప్రైవేటు కాలేజీలు స్కూలు వర్షాకాలం కనుక శుభ్రంగా ఉంచేందుకు తగు సూచనలు చేస్తూ కమిషనర్  పర్యవేక్షణ చేయాలన్నారు.  మంచినీటి సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు మంచినీరు కాలుషితం పైపులు పరిశీలన చేయాలని , శానిటేషన్ ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు కాలవలు వీధులు శుభ్రంగా ఉంచుటకు తగిన కార్మికుల సంఖ్య పెంచాలన్నారు.  ఇంజనీరింగ్ విభాగం కార్మికులు అనేక రోజుల నుండి సమస్యలు పరిష్కరించాలని నిరసన దీక్ష చేస్తున్నారని వారికి వేతనాలు పెంచి తక్షణమే కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పై సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మోటా రాముడు సహాయ కార్యదర్శి రామ్మోహన్ సిపిఐ జిల్లా సభ్యులు కే ప్రభాకర్ ఏఐఎస్ఎఫ్ నాయకులు మనోజ్ లు ట్రాక్టర్ శ్రీనివాసన్ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!