
ఓరియంటల్ హైస్కూల్ హెడ్మాస్టర్ పై డీఈఓకు ఫిర్యాదు
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్ వెలుగు; విద్యార్థులతో తమ సొంత పనులు చేపించుకుంటున్న హెడ్మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి కి డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్ రాజ్ వినతి పత్రం ఇచ్చి అనంతరం మాట్లాడుతూ పొద్దుటూరు పట్టణంలో ఉన్న గీత ఆశ్రమం లో ఓరియంటల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుధీర్ కుమార్ విద్యార్థులతో తమ సొంత పనులు చేపించుకుంటున్నారు అలాగే భోజన పాత్రలు మోపించడం జరుగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్నో ఆశలతో ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ప్రధాన ఉపాధ్యాయులు సుధీర్ కుమార్ తమ ఇష్టం వచ్చినట్లు తమ సొంత పనులు చేపించుకుంటున్నారు కాబట్టి వెంటనే న్యాయ విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాము. పేద విద్యార్థులకు అన్యాయం చేసే ప్రధానోపాధ్యాయులు సుధీర్ కుమార్ ను తొలగించేంతవరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాము.