
ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు సీఎం
న్యూస్ వెలుగు విశాఖపట్నం: ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని, మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలు ముఖ్య భూమిక పోషిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావటంతో పాటు వేగంగా సమర్థవంతంగా చేరుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పీఎస్ నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు.
Was this helpful?
Thanks for your feedback!

