
నారాయణ పాఠశాలలో డిజిటల్ తరగతులు
న్యూస్ వెలుగు, కర్నూలు; ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ద్వారా విద్యార్థులకు సమర్థవంతమైన ఖచ్చితమైన డిజిటల్ తరగతులు ప్రారంభ మవుతున్నాయని ప్రిన్సిపాల్ మహమ్మద్ అల్తాఫ్ తెలిపారు. స్థానిక మాధవనగర్ లోని నారాయణ పాఠశాలలో గురువారం ఎలైట్ విభాగంలో తల్లిదండ్రుల చేతులు మీదుగా డిజిటల్ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తరగతి గదిలో టీచర్ సంక్లిష్టతలను పరిష్కరిస్తూ, వారి ప్రశ్నలకు సమర్థవంతంగా ప్రతిస్పందించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నాం అన్నారు. డిజిటల్ తరగతుల వల్ల విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఎక్కువ కాలం గుర్తుండే విధంగా బోధన జరుగుతుందన్నారు. సాంకేతికంగా అభివృధి చెందుతున్న తరుణంలో విద్యార్థులు పరిపక్వత చెందడానికి నారాయణ విద్య సంస్థలు ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఎ డి వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ నాగేశ్వరి, రాధ పాల్గొన్నారు.