వికలాంగుల సంక్షేమo పిల్లలకు దుప్పట్లు పంపిణీ

వికలాంగుల సంక్షేమo పిల్లలకు దుప్పట్లు పంపిణీ

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి రావు

న్యూస్ వెలుగు, కర్నూలు; రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలమేరకు 17-12-2024 న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, కర్నూలు అసిస్టెంట్ డైరెక్టర్, వికలాంగుల సంక్షేమం, లింగమార్పిడి & సీనియర్ సిటిజన్స్, కర్నూలు రెడ్ క్రాస్ సొసైటి వారి సహాయ సహకారముతో, సమన్వయంతో కర్నూలులోని బాలుర వికలాంగుల వసతి గృహం, బి.క్యాంప్‌లోని వికలాంగ పిల్లలకు దుప్పట్లు, దిండ్లు అందించారు. మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల అవసరార్థం అనేక చట్టాలు వున్నాయని వాటిని సరైన రీతిలో ఉపయోగించి సత్వర న్యాయం పొంద వచ్చునని తెలిపారు. మానసిక దివ్యాంగుల సంరక్షణ కొరకు స్నేహ పూర్వక న్యాయ సేవల పథకం 2005 గురించి వివరించారు. వీరందరికి ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందని తెలియజేశారు. ఉచిత న్యాయ సహాయం కోరువారు లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నంబర్-15100 ఉపయోగించుకోవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎం.శివరామచంద్ర రావు కే.వి. సుబ్బ రెడ్డి, డా. కే.గోవిందా రెడ్డి, సంబంధిత శాఖల వారు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!