రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

 రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

నంద్యాల, న్యూస్ వెలుగు  : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం భోజనం గ్రామంలో రైతులకు రీ సర్వే పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంను గురువారం తహశీల్దార్ పి. పద్మావతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన

రీ సర్వే నూతన ప్రభుత్వ రాజ ముద్ర తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు పంపిణీ చేస్తున్నామని గ్రామంలోని గ్రామసభలో తహశీల్దార్ తెలిపారు. రైతులు తమ పాత పట్టాదార్ పాసుబుక్కు పత్రాలు సమర్పించి నూతన రీ సర్వే పట్టాదార్ పాస్ పుస్తకాలను తీసుకోవాలని తహశీల్దార్ రైతులకు తెలిపారు. గ్రామానికి సంబంధించి మొత్తం 933 పట్టాదారు పాస్ పుస్తకాలకు గాను ప్రస్తుతం 703 పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని, 180 జాయింట్ ఎల్పి, రైతు వారి పట్టాదారు పుస్తకాలు 44, డెత్ 6 ఉన్నాయని. వీటి సవరణ కూడా త్వరలో ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపడుతామని తహశీల్దార్ తెలిపారు. పాస్ పుస్తకాలలో ఏమైనా తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సరిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నరసింహులు, గ్రామ విఆర్ఓ కృష్ణ సర్వేర్ సంజీవ, వివిధ విఆర్వోలు సచివాలయం సర్వేయర్సు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS