రెవెన్యూ క్లినిక్ లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి

రెవెన్యూ క్లినిక్ లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి

కర్నూలు న్యూస్ వెలుగు : జిల్లావ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్లను ఏర్పాటు చేసి జిల్లాలోని భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 5న సోమవారం రెవెన్యూ క్లినిక్లను తనిఖీ చేయడం జరిగిందని వారు వెల్లడించారు. ఫిర్యాదుదారుల నుంచి వస్తున్న అర్జీలను కౌంటర్లలో ఎలా నమోదు చేస్తున్నారు వంటి వివరాలను డిఆర్ఓ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదు తాలూకు వివరాలను వారు కోరగా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన ఉప్పరి రాజు తండ్రి లక్ష్మయ్య తమ భూమిని కొంతమంది ఆక్రమించినట్లు తన దృష్టికి రావడం పై రెవెన్యూ అధికారులను ఈ అంశంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తమకు తెలపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!